Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం టాలీవుడ్లో చిరంజీవి, సల్మాన్ ఖాన్ నటిస్తున్న భారీ ఎంటర్టైనర్ 'గాడ్ ఫాదర్'. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అన్ని హంగులతో అక్టోబర్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో వరుసగా అప్డేట్లు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌పై చిత్రీకరించిన ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ ప్రోమోను మంగళవారం చిత్రబృందం విడుదల చేసింది. థమన్ సంగీతం అందించిన ఈ పాటను ఈ నెల 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా, పూరి జగన్నాథ్, సత్యదేవ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.