Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఒకే ఒక జీవితం. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలైంది. ఈ నేపధ్యంలో దర్శకుడు శ్రీకార్తిక్ మీడియాతో మాట్లాడారు. 'కథని రాయడానికి రెండేళ్ళు పట్టింది. హీరో కోసం ఏడాదిన్నర, కోవిడ్ వలన రెండేళ్ళు పట్టింది. సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి దాదాపు ఐదేళ్ళు పట్టింది. అయితే నా నిరీక్షణకి తగిన ఫలితం దక్కింది. సినిమా అందరికీ కనెక్ట్ అయ్యింది. ఒక బరువు దిగిన భావన కలుగుతోంది. ఈ సినిమా తీయడానికి కారణం మా అమ్మ. నాకు సైన్స్ చాలా ఇష్టం. అందుకే సైన్స్ జోడించా. శర్వానంద్‌తో పని చేయడం గొప్ప అనుభవం. అమల గారికి కథ చెప్పిన వెంటనే ఒకే చేశారు. సినిమా చూసిన తర్వాత నాగార్జున గారు శర్వానంద్ తో 'ఇకపై నిన్ను నా కొడుకులా చూస్తా' అన్నారు. ఈ కాంప్లీమెంట్ నాకు దొరకలేదు కానీ అది నాకు దక్కిన కాంప్లీమెంట్ లానే భావిస్తా. నా రెండో సినిమా అల్లు అర్జున్ గారితో చేయాలనీ వుంది. నాకు హైదరాబాద్ ఇష్టం. అమ్మ బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్‌గా చేశారు. నాన్న రియల్ ఎస్టేట్‌లో చేసేవారు. నేను ఎస్ఆర్ఎంలో ఇంజనీరింగ్ చేశాను. మనం చేసే పని పట్ల నిజాయితీగా వుంటే విజయం తప్పకుండా వస్తుంది. ఈ సినిమా జరుగుతున్నపుడు చాలా సందర్భాల్లో ఇది అనుభవంలోకి వచ్చింది.' అన్నారు.