Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్‌పై సౌత్ కొరియా యాక్షన్ - కామెడీ చిత్రం 'మిడ్నైట్ రన్నర్స్' కు అధికారిక రీమేక్‌గా నిర్మాతలు డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'శాకిని డాకిని'. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. 'శాకిని డాకిని' సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. హీరో అడవి శేష్, దర్శకులు నందిని రెడ్డి, అనుదీప్, విమల్ కృష్ణ ఈ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు. ఈ వేడుకలో రెబల్ స్టార్ కృష్ణంరాజుకు నివాళిగా చిత్ర బృందం మౌనం పాటించి అంజలి ఘటించింది.