Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేశ్‌బాబు - రాజమౌళి కాంబినేషన్లో ఓ ప్రాజెక్టు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి భారీ ప్రాజెక్టుల వల్ల ఈ సినిమా ఆలస్యమౌతూ వచ్చింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులను రాజమౌళి మొదలుపెట్టారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్‌బాబు సినిమా పూర్తవగానే ఆయన రాజమౌళి ప్రాజెక్టులోకి అడుగుపెడతారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న రాజమౌళి ఈ ప్రాజెక్టుపై ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. 'ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథ ఇది' అని చెప్తూ, యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో కెఎల్.నారాయణ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో తాను ఉత్సాహంగా ఉన్నట్లు ఇప్పటికే మహేశ్‌బాబు తెలియజేశారు. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు సాగుతున్నాయి.