Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమన్నా టైటిల్ రోల్లో నటిస్తున్న బాలీవుడ్ చిత్రం 'బబ్లీ బౌన్సర్'. ఈ చిత్రంలో తమన్నా లేడి బౌన్సర్‌గా కనిపించనుంది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించారు. మునుపెన్నడూ చూడని విధంగా ఈ చిత్రంలో తమన్నాను దర్శకుడు మధుర్ చూపించబోతున్నారని ఇటీవల విడుదలైన ట్రైలర్ చెప్పకనే చెప్పింది. అలాగే ఈ ట్రైలర్లో ఫుల్ ఎనర్జిటిక్ రోల్లో తమన్నాను చూడవచ్చు. దర్శకుడు మధుర్ భండార్కర్ తన చిత్రాల్లో ముఖ్యంగా మహిళా ప్రధాన చిత్రాల్లో కథానాయికలను ఎలా ప్రజెంట్ చేస్తారో వేరే చెప్పక్కర్లేదు. ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటాయి. అలాగే ఈ చిత్రంలోనూ బబ్లీ బౌన్సర్‌గా తమన్నా పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుందని ట్ర్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అంతేకాదు ఇదొక సంతోషకరమైన సరదా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా. ఈ చిత్రం ఈనెల 23న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ, 'నేను ఇప్పటివరకు ఎన్నో చిత్రాల్లో భిన్న పాత్రలను పోషించాను. అయితే వాటితో పోలిస్తే ఇందులో పోషించిన పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. బౌన్సర్లగా మనం ఇప్పటి వరకు మగవాళ్ళని మాత్రమే చూశాం. అయితే మహిళలు కూడా బౌన్సర్లుగా ఉంటారని, బౌన్సర్లుగా వాళ్ళు ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొంటారని చూపించే సినిమా ఇది. అలాగే ఆద్యంతం వినోదాత్మకంగానూ ఉంటుంది. దర్శకుడు మధుర్గారు నా పాత్రను సిల్వర్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం సింప్లీ సూపర్' అని తెలిపారు.