Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శింబు హీరోగా గౌతమ్ మేనన్ తెరకెక్కించిన తమిళ చిత్రం 'వెందుతనిందు కాడు'. ఇది రెండు భాగాలుగా రూపొందుతోంది. ఈ సినిమాను నిర్మాత స్రవంతి రవికిషోర్ తెలుగులో 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే, ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. తెలుగు వెర్షన్‌కు మరో రెండు రోజులు ఆలస్యం కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. సెప్టెంబరు 17న ముత్తు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తమిళ వెర్షన్ 15నే విడుదల కాబోతుంది. అనుకున్న సమయానికి డబ్బింగ్, ఇతర టెక్నికల్ విషయాలు పూర్తికాకపోవడంతో ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది.