Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్ 'మహానటి' సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో జీవించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇటీవల 'సీతారామం' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి లెఫ్టినెంట్ రామ్ పాత్రలో మెప్పించారు. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. భారీ వసూళ్లు రాబట్టడమే కాక సౌత్ ఇండిస్టీలో దుల్కర్ సల్మాన్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చంది. ప్రస్తుతం ఈ హీరో డైరెక్టర్ ఆర్.బాల్కీ దర్శకత్వంలో 'చుప్.. రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్' సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 23న విడుదల కానుంది. చెడు విమర్శలు ఎదుర్కొంటున్న ఓ కళాకారుడి బాధను ఈ మూవీలో చూపించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవలే ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
'కెరీర్ ఆరంభంలో నాపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. నా నటన సరిగ్గా లేదంటూ రివ్యూ ఇచ్చారు. ఆ సమయంలో నేను ఎక్కువగా నా గురించి చెడు రివ్యూస్ చదివాను. కొన్నిసార్లు నేను సినిమాలు మానేయాలని జనం కోరుకుంటున్నట్లు రాశారు. నేను నటన కోసం తయారు చేయబడలేదని.. అందుకే నేను ఇండిస్టీలో ఉండకూడదని కోరుకున్నారు. ఇలాంటి రివ్యూస్ చాలా బాధపెడతాయి' అంటూ చెప్పుకొచ్చారు దుల్కర్. దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ కేవలం హీరోగానే కాకుండా.. సింగర్ గానూ రాణిస్తున్నారు.