Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ కథానాయకుడు షారుఖ్ ఖాన్‌ను రజనీకాంత్ కలిశారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో 'జైలర్' రూపొందుతోంది. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ 'జవాన్' చిత్రంలో నటిస్తున్నారు. అయితే, ఈ రెండు చిత్రాల షూటింగ్ చెన్నైలోని ఆదిత్యరామ్ స్టూడియోస్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా రజనీకాంత్ 'జవాన్' సెట్‌కు వెళ్లి షారుఖ్‌ఖాన్‌ను సర్ప్రైజ్ చేశారు. ఇద్దరూ కొద్దిసేపు, వ్యక్తిగత జీవితం, సినిమాల గురించి మాట్లాడుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. రజనీకాంత్ స్వయంగా వచ్చి పలకరించడంతో షారుఖ్ ఖాన్ ఆనందించారు.