Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హృతిక్ రోషన్, సైఫ్ ఆలీఖాన్ కలిసి నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'విక్రమ్ వేద'. సెప్టెంబర్ 30న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమైంది. పుష్కర్ గాయత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమా 100 దేశాల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ లాంటి 22 యూరప్ దేశాలతో పాటు ఆఫ్రికాలోని 27 దేశాల్లోనూ విడుదల కానుంది. తమిళంలో విజయవంతమైన 'విక్రమ్ వేద' చిత్రాన్ని హిందీలోనూ అదే పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.