Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలీ ప్రసాద్ హీరోయిన్గా సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో అహితేజ బెల్లంకొండ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న చిత్రం 'శశివదనే'.
గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గురించి నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ, ''పలాస 1978' సినిమాతో చలచిత్ర పరిశ్రమ ప్రముఖులను, ప్రేక్షకులను దష్టిని ఆకర్షించిన యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి చాలా చక్కని నటనను కనపరచ్చాడు. హీరోయిన్ కోమలీ ప్రసాద్ కూడా చాలా చక్కగా నటించింది. ఈ చిత్రంలో పని చేసిన నటీనటులు అందరూ పోటీ పడి నటించారు. చిత్ర దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తయారు చేసుకున్న ఈ చిత్రాన్ని చాలా చక్కగా గ్రాండియర్‌గా, హై స్టాండర్డ్స్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్స్ పై సాగే లవ్ సీన్స్ చాలా కొత్తగా, యూనిక్‌గా ఉంటాయి.ఈ చిత్రానికి మ్యూజిక్, విజువల్స్ హైలైట్‌గా నిలుస్తాయి. ఇందులో ఉన్న ఐదు పాటలు అద్భుతంగా వచ్చాయి. ఇప్పటి వరకు తీసిన సన్నివేశాలు చూసుకున్నాం. చాలా బాగా వచ్చాయి. మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, నవంబర్‌లో మా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. కచ్చితంగా ఈ సినిమా అందర్నీ అలరిస్తుంది' అని అన్నారు.