Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాటకం, సుందరి, తీస్ మార్ ఖాన్ వంటి భిన్న చిత్రాలు, విభిన్నమైన జానర్లలో తీస్తూ దర్శకుడిగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కల్యాణ్ జి గోగణ. తాజాగా మరో విభిన్నమైన చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. నవయుగ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద రాబోతున్న ఈ చిత్రానికి 'కళింగరాజు' అనే టైటిల్ను ఖారారు చేశారు. రవికుమార్, ఐ.రవికుమార్ నిర్మాతలుగా, నేహా సింగ్ సమర్పకురాలిగా, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ ఖుషీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్రబృందం త్వరలో ప్రకటించనుంది.