Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమల్ హాసన్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ప్రతి ష్టాత్మక చిత్రం 'భారతీయుడు-2' నుంచి యూనిట్ సభ్యుల ద్వారా తాజాగా ఓ అప్డేట్ బయటకు వచ్చింది. ఒక సన్నివేశంలో ఏకంగా 10 నిమిషాల డైలాగ్‌ను కట్ లేకుండా కమల్ హాసన్ చెప్పారని తెలుస్తోంది. పైగా ఆ పది నిమిషాల డైలాగ్స్‌లో ఏకంగా 14 భాషలు ఉంటాయని సమాచారం. ఆ పది నిమిషాల షాట్‌ని షూట్ చేసిన సమయంలో యూనిట్ సభ్యులంతా అలా చూస్తూ ఉండి పోయారట. శంకర్, కమల్ కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు సినిమాకు ఈ చిత్రం సీక్వెల్ అనే విషయం తెల్సిందే. చాలా సంవత్సరాల తర్వాత సీక్వెల్ వస్తున్నప్పటికి ఈ తరం ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో సినిమా గురించి వస్తున్న ప్రతి విషయం ఆసక్తిని పెంచుతూనే ఉంది.