Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత కొద్దిరోజులుగా తెలుగు సినిమా ఇండిస్టీలో జరుగుతున్న పలు సమస్యల పరిష్కారం దిశగా జరుగుతున్న చర్చల్లో వేతనాల సమస్యపై ఒక కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ నిర్మాత, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు అధ్యక్షతన జరిగిన తాజా సమావేశంలో సినీ కార్మికుల వేతనాల విషయంలో ఫిలిం ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సమిష్టి నిర్ణయం తీసుకున్నారు. కార్మికుల వేతనాలు పెద్ద సినిమాలకు 30 శాతం, చిన్న సినిమాలకు 15 శాతం పెంచేందుకు అంగీకరించినట్టు సమాచారం. అయితే ఏది చిన్న సినిమా, ఏది పెద్ద సినిమా అనేది ఫిలిం ఛాంబర్ అండ్ ఫెడరేషన్ కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, దీనిపై త్వరలోనే స్పష్టత రానుందని తెలుస్తోంది. అయితే ఒక్క విపిఎఫ్ చార్జీలు తప్ప మిగిలిన అన్ని విషయాలపై ఈ సమావేశాల్లో స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.