Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డి.సరేష్బాబు, సునీత తాటి సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం 'దొంగలున్నారు జాగ్రత్త'. శ్రీసింహా కోడూరి, ప్రీతి అస్రాని హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రబృందం గురువారం ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసింది. ఖరీదైన కారును దొంగలించానుకున్న దొంగ అందులోనే ఇరుక్కుపోయి, ఎలా బయటపడ్డాడనే ఇతివృత్తంతో ఆద్యంతం ఉత్కంఠగా సాగేలా చిత్రాన్ని రూపొందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'దొంగలున్నారు జాగ్రత్త' చిత్రాన్ని సెప్టెంబరు 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.