Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈటీవీ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు హీరోగా రాబోతున్నారు. శనివారం చంద్రహాస్ పుట్టిరోజు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని శుక్రవారం 'ఇంట్రడ్యూసింగ్ చంద్రహాస్' పేరుతో మీడియాతో ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న చిత్రాల నుంచి హ్యాపీబర్త్‌డే విషెస్‌తో కూడిన పోస్టర్లను చంద్రహాస్ తల్లి మలయజ లాంచ్ చేశారు. అలాగే ఇదే వేదికపై మీడియా సమక్షంలో చంద్రహాస్ కేక్ కట్ చేశారు.
ఈటీవీ ప్రభాకర్ మాట్లాడుతూ, 'నాలాగే మా అబ్బాయి చంద్రహాస్ కూడా ఇండిస్టీని నమ్ముకుని, నటననే ప్రొఫెషన్‌గా తీసుకున్నాడు. 'నాటు నాటు' కవర్ సాంగ్ వీడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. పేరుతో పాటు సినిమా హీరోగా కూడా రెండు అవకాశాలు వచ్చాయి. గతంలో రెండు సినిమాలు నిర్మించిన ప్రొడ్యూసర్స్ కిరణ్ బోయినపల్లి, కిరణ్ జక్కంశెట్టి ఐ.ఇ.ఎఫ్, ఆర్.కె-ఏ.కె ఫిలింస్ పతాకం ప్రొడక్షన్ నెం.3గా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం కష్ణ. అలాగే ఏవీఆర్ మూవీ వండర్స్ పతాకంపై గతంలో రెండు సినిమాలను నిర్మించిన ఏవీఆర్, నరేష్ తమ మూడో చిత్రంగా ప్రొడక్షన్ నెం.3 పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి దర్శకుడు సంపత్ వి.రుద్ర. వీరితో పాటు మా స్వంత సంస్థ శ్రీ సుమనోహర ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఓ చిత్రాన్ని నిర్మించటానికి ప్లాన్ చేశాం. దీనికి నా మిత్రులు కళ్యాణ్, వెంకట్, కాముని శివ, ప్రేమ్ సాగర్, తోట సురేష్‌లు కో-ప్రొడ్యూసర్లు. దీనికి కథ, స్క్రీన్‌ప్లేని నేను అందిస్తున్నాను' అని చెప్పారు. 'చంద్రహాస్ కూడా వాళ్ల నాన్నగారిలానే మంచి హార్డ్ వర్కర్. మా అబ్బాయి నిర్మాతలకు ఎప్పుడూ ఎస్సెట్ కావాలి' అని చంద్రహాస్ తల్లి మలయజ తెలిపారు.
హీరో చంద్రహాస్ మాట్లాడుతూ,' నేను చిన్నప్పట్నుంచి షూటింగ్‌ల వాతావరణంలోనే పెరిగాను. నాకు సినిమా తప్ప ఇంకేమీ తెలియదు. హీరో అవ్వాలనేది నా డ్రీమ్. నేను చేసిన 'నాటు నాటు' కవర్ సాంగ్ చూసి నాకు అవకాశం ఇచ్చారు మా దర్శక, నిర్మాతలు. హీరోనా నన్ను నేను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తాను' అని చెప్పారు.