Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అన్నమయ్య , శ్రీరామదాసు, మంజునాథ, శిరిడిసాయి, ఓం నమో వెంకటేశాయ' వంటి అద్భుత భక్తిరస చిత్రాల సరసన మరో సినిమా తెలుగు వెండితెరపైకి రాబోతుంది. నేటి యువతకు శ్రీ మహా విష్ణు మహత్యం తెలియజేసే ఉద్దేశ్యంతో గోవింద రాజ్ విష్ణు ఫిల్మ్స్ బ్యానర్ పై రామావత్ మంగమ్మ నిర్మిస్తున్న భక్తిరస చిత్రం 'శ్రీ రంగనాయక'. దుందిగల్ వినరు రాజ్ మహావిష్ణు పాత్రలో టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ నంది వెంకట్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు.
భక్తుడి పాత్రలో రంగాబాషా, లంకెల అశోక్ రెడ్డి, పండ్రాల లక్ష్మీ , పరవాడ సత్యమోహన్, నిహారిక చౌదరి, తన్నీరు నాగేశ్వరరావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డ్రమ్స్ రాము సంగీతం అందించిన ఈ మూవీ ఆడియో, ప్రీ రిలీజ్ వేడుక ఇటీవల ఏ.వి కాలేజ్లో ఘనంగా జరిగింది. ఈ నెల 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దుందిగల్ వినరు రాజ్ మాట్లాడుతూ, 'ఇందులో శ్రీ మహావిష్ణు పాత్రలో నటించడం పూర్వజన్మ సుకతం. దర్శకులు నంది వెంకట రెడ్డి అద్భుతంగా చిత్రీకరించారు. ఇదొక మంచి భక్తిరస చిత్రంగా ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నాం' అని తెలిపారు.
'ఈ చిత్రంలో భక్తుడి పాత్రలో నటించాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ నెల 23న విడుదల అవుతున్న మా మూవీని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను' అని రంగాబాషా చెప్పారు.
నటుడు లంకెల అశోక్ రెడ్డి మాట్లాడుతూ, 'దుందిగల్ వినరు రాజ్ని దర్శకులు వెంకట్ రెడ్డి వెండితెరకు పరిచయం చేస్తున్నారు. బిగ్ స్క్రీన్ పై వినరు రాజ్ గారిని చూస్తుంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు దిగివచ్చినట్టు ఉంది. ఎన్నో వ్యయప్రయాసలతో రూపొందింని మా సినిమాను ప్రేక్షకులు దిగ్విజయం చేయాలని ఆశిస్తున్నాను' అని తెలిపారు.
అతిథి నటులు కుప్పిలి శ్రీనివాసరావు మాట్లాడుతూ, 'చిన్న సినిమా అనుకున్నాం కానీ.. స్క్రీన్ పై అవుట్ పుట్ చూశాక ఓ పెద్ద సినిమాను చూస్తున్న ఫీలింగ్ కలిగింది' అని అన్నారు.