Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీజ ఆర్ట్స్, బాచిన వైష్ణవ్ చౌదరి ఫిల్మ్స్ పతాకాలపై అమీర్, ప్రణీత, దీపిక జంటగా పూదారి రాజాగౌడ్, డా.ఎలిశాల లింగం, పూదరి రాజశేఖర్ గౌడ్, బాచిన నాగేశ్వరరావు నిర్మాణం లో వస్తున్న సినిమా 'ఇట్లు' (మీకు తెలుసా అనేది ట్యాగ్ లైన్).
ఈ సినిమాతో పందిళ్లపల్లి రోషి రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, త్వరలో విడుదలకు సిద్దమైన సందర్భంగా చిత్ర యూనిట్ ఇటీవల ప్రసాద్ ల్యాబ్‌లో టీజర్, ట్రైలర్‌ను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన హీరో సుమన్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకష్ణ గౌడ్, లయన్ సాయి వెంకట్ టీజర్‌ను, కుప్పిలి శ్రీనివాస్, నిర్మాత టి.ఎస్.ఆర్, ఉప్పల మెట్టయ్య, పెంచల స్వామి ట్రైలర్‌ను రిలీజ్ చేేశారు. హీరో సుమన్ మాట్లాడుతూ,'ఇదొక నయా సస్పెన్స్ థ్రిల్లర్. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాను. దర్శకుడు మంచి స్టోరీతో చాలా చక్కగా డైరెక్షన్ చేశాడు. నిద్ర లేకుండా సినిమా కోసం నిర్మాతలు చాలా కష్టపడ్డారు. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా చాలా బాగుంటుంది' అని అన్నారు.
'సస్పెన్స్ థ్రిల్లర్ కథతో వస్తున్న మా సినిమాలో సుమన్ గారు నటించడమే కాకుండా మాకు సలహాలు, సూచనలు ఇస్తూ మాకెంతో సపోర్ట్ నిలిచారు' అని నిర్మాతలు పూదరి రాజశేఖర్ గౌడ్, డాక్టర్ ఎలిశాల లింగం అని అన్నారు. 'నటీనటులు, టెక్నీషియన్స్ అందరి సపోర్ట్‌తో సిినిమా బాగా వచ్చింది. మ్యూజిక్ విడుదల విషయంలో ఏ ఆర్ ఎంటర్టైన్మెంట్ అమిత్ అగర్వాల్, ఓల్గా రాజు బాగా సపోర్ట్ చేశారు' అని దర్శకుడు పందిళ్లపల్లి రోషి రెడ్డి చెప్పారు.