Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా నటిస్తున్న చిత్రం 'ఛేజింగ్'. డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే తమిళంలో విడుదలై సూపర్ సక్సెస్ అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు.
శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ పై 'ఒరేరు బామ్మర్ది', 'మై డియర్ భూతం ' లాంటి పలు సూపర్ హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఏఎన్ బాలాజీ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెలలో అదే 'ఛేజింగ్' పేరుతో గ్రాండ్గా విడుదలకు సిద్ధమవుతోంది. కె.వీరకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మదిలగన్ మునియాండి నిర్మించారు. తాషి మ్యూజిక్ సమకూర్చు తుండగా, ఇ. కష్ణస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగులో కూడా ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ సాధిస్తుందని నమ్మకంగా మేకర్స్ ఉన్నారు.