Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'లవ్ భూమ్, 7 టు 4, చిత్రం ఎక్స్' సినిమాల్లో హీరోగా నటించి రాజ్ బాల తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నేడు (శనివారం) రాజ్ బాల పుట్టినరోజు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ''ఎందుకంటే ప్రేమంటే', 'తొంగి తొంగి చూడమాకు చందమామ', 'అంతకుమించి' తర్వాత డైరెక్టర్ నగేష్ నారాదాసి గారు 'లవ్ బూమ్' సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు. విజరు శేఖర్ సంక్రాంతి '7 టు 4', రమేష్ విభూది డైరెక్షన్లో వచ్చిన 'చిత్రం ఎక్స్' సినిమాలతో నాకు చాలా మంచి గుర్తింపు లభించింది. ఈ పది సంవత్సరాలు జర్నీలో ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొని నటుడుగా, హీరోగా ప్రేక్షకుల్ని మెప్పించటం ఆనందంగా ఉంది. ప్రస్తుతం మెగా ఫిలిమ్స్ పతాకం పై కమలాకరరావు, కిషోర్ నిర్మాతలుగా జాక్ దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.1లో హీారోగా చేస్తున్నాను. 40% చిత్రీకరణ పూర్తి అయిన ఇందులో కాలకేయ ప్రభాకర్ విలన్గా, ఇషా చావ్లా హీరోయిన్గా నటిస్తున్నారు. మాస్ క్యారెక్టర్లో సినిమా మొత్తం ఆద్యంతం ఎంటర్టైన్మెంట్తో చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన 'గాలోడు' రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో నెగిటివ్ రోల్ చేశాను. కన్నడలో 'ననిగే ఎంతి బేకు', తెలుగులో 'నాకు పెళ్ళాం కావాలి' వంటి బై లింగ్విల్ సినిమా చేస్తున్నాను. మరో సినిమా 'బహన్నల'. తెలుగు, హిందీ తమిళంలో 'రా' సినిమా చేస్తున్నాను. ఆ సినిమాకు 'రా' అని టైటిల్ పెట్టారు' అని తెలిపారు.