Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా సినిమా 'అల్లూరి'. ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. బెక్కెం బబిత సమర్పిస్తున్నారు.
ఈనెల 23న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న సందర్భంగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను యువ కథానాయకుడు నాని లాంచ్ చేశారు. ఆయన మాట్లాడుతూ, 'ట్రైలర్ చాలా బావుంది. అలాగే శ్రీవిష్ణుకి కూడా కొత్తగా ఉంది. ఈ మధ్య కాలంలో ఎనర్జిటిక్ ఫిలిమ్స్‌ని ప్రేక్షకులు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. అల్లూరి పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు.
'ప్రదీప్ వర్మ ఈ కథని చెప్పినపుడు ఇలాంటి గొప్ప కథని ఎలాగైనా ప్రేక్షకులకు చెప్పాలని అనుకున్నాం. బెక్కం వేణుగోపాల్ గారు ఈ నిజాయితీ గల కథని ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు' అని హీరో శ్రీవిష్ణు తెలిపారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ, 'అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమా ఇది. ట్రైలర్ అందరికీ నచ్చింది. సినిమా ఇంతకంటే పెద్ద విజయం సాధిస్తుంది. ఈనెల 18న హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరగనుంది. ఈ ఈవెంట్‌కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు' అని అన్నారు.