Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫ్రాగ్రన్స్ మ్యానిఫెస్టేషన్ పతాకంపై చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా జే.డి.స్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'వేద'. జె.సుధాకర్, శివ బి, రాజీవ్ కుమార్ బి, శ్రీనివాస్ లావూరి, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని (అమెరికా) సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన అగ్ర దర్శకుడు సుకుమార్ టీజర్‌ను విడుదల చేయగా, రచయిత చంద్రబోస్ మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ,'మోషన్ పోస్టర్ అదిరిపోయింది. టీజర్ చూస్తే బ్లాస్టింగ్. 'వేద' టైటిల్ కూడా నైస్. నిర్మాతలు అందరికీ ఆల్ ది బెస్ట్. సంగీత దర్శకుడు అజరు మంచి వర్క్ చేశారు. చంద్రబోస్ గారి సాహిత్యం గురించి ఇక చెప్పేదేముంది. రాకింగ్. హీరో చేనాగ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. టీం అందరికీ అల్ ద బెస్ట్' అని అన్నారు.
'సొసైటీలో ఉన్న చాలా విషయాలతో, ఒక కొత్త జోనర్‌తో రావాలని సైకో రొమాంటిక్ థ్రిల్లర్ కథను రెడీ చేశాను. ప్రస్తుతం చాలా మంది సిగరెట్ రూపంలో, కొకైన్ రూపంలో ఇలా ఎదో రూపంలో డ్రగ్స్ తీసుకుంటుంటారు. కానీ.. ఈ డ్రగ్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్‌ను డ్యామేజ్ చేస్తుంది. అయితే ఈ ఫిల్మ్ లో ఇచ్చే డ్రగ్ మాత్రం మీకు ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ ను క్యూర్ చేసి మిమ్మల్ని లైఫ్ లాంగ్ హెల్తీగా ఉంచుతుంది' అని చిత్ర దర్శకుడు జె.డి. స్వామి తెలిపారు. నిర్మాత రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, 'సమాజానికి ఉపయోగపడే ఒక కొత్త ఎక్స్పరిమెంట్ల్ సినిమా చేస్తున్నాం' అని చెప్పారు. 'మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి' అని మరో నిర్మాత రాజేంద్ర అన్నారు. హీరో చే నాగ్ మాట్లాడుతూ, 'డి. ఓ పి మంచి విజువల్స్ ఇచ్చారు. ఇందులోని సాంగ్స్ అద్భుతంగా ఉంటాయి' అని తెలిపారు.