Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కృష్ణ వ్రింద విహారి'. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మించిన ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
ఈనెల 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న నేపథ్యంలో దర్శకుడు అనీష్ ఆర్. కృష్ణ మీడియాతో మాట్లాడుతూ, 'ఇది చాలా బలమైన కథ. ఇప్పటివరకూ ఇందులో ఉన్న యూనిక్ పాయింట్‌ని ఇంకా రివీల్ చేయలేదు. ప్రీరిలీజ్ ఈవెంట్లో కథపై ఒక అవగాహన ఇస్తాం. అయితే ఈ కథకి మూలం మాత్రం నాకు బాగా కావాల్సిన సన్నిహితుడు జీవితంలో జరిగిన సంఘటన. దాని ఆధారంగా ఫ్రేమ్ చేసుకున్న కథ ఇది. ఈ పాయింట్ చాలా ఎంటర్ టైనర్‌గా ఉంటుంది. ప్రేక్షకులు హిలేరియస్‌గా ఎంజారు చేస్తారు. బ్రాహ్మణ పాత్రలో ఇప్పటికే పలువురు హీరోలు చేశారు. ఎవరి స్టయిల్ వారికి ఉంటుంది. నాగశౌర్యకి కూడా ఒక యూనిక్ స్టయిల్ ఉంది. ప్రమోషన్ కోసం పాదయాత్ర చేసే ఆలోచన మా నాగశౌర్యదే. ఈ సినిమా ఆయనకి చాలా నమ్మకాన్ని కలిగించింది. ఆయన ఈ సినిమాని చాలా ఎంజారు చేశారు. ఆ ఆనందాన్ని ప్రేక్షకులు కూడా పొందాలని ఆయనే స్వయంగా జనాల్లోకి వెళ్లారు. పాదయాత్రకి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. పాదయాత్ర తర్వాత సినిమాపై బజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్ళింది' అని చెప్పారు.