Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథానాయిక తమన్నా లేడీ బౌన్సర్‌గా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'బబ్లీ బౌన్సర్'. మధుర్ భండార్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టార్ స్టూడియోస్, జంగిలీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రాన్ని ఈనెల 23న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా దర్శకుడు మధుర్ భండార్కర్ మాట్లాడుతూ, 'నార్త్ సైడ్‌లో లేడీ బౌన్సర్లను చూశాను. వారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమా చేశాను. ఈ సినిమాలో హీరోయిన్ బబ్లీగా, ఫిజికల్‌గా, మెంటల్‌గా మెచ్యూరిటీ చూపించాలి.ఈ విషయంలో తమన్నా ది బెస్ట్ అనిపించింది' అని తెలిపారు.
'తొలి సారిగా లేడీ బౌన్సర్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ స్క్రిప్ట్ నాకు దొరకడం నా అదృష్టం. పలు సార్లు జాతీయు అవార్డ్స్ పొందిన మధుర్ భండార్కర్‌తో చేసే అవకాశం వచ్చిందుకు చాలా గ్రేట్‌గా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాలో హరియాణాకు చెందిన యువతిగా నటించాను. తప్పకుండా ఈ సినిమా నా కేరీర్లో బెస్ట్ సినిమా అవుతుంది. మధుర్ బండార్కర్ సినిమాలో నటించిన హీరోయిన్స్ కు జాతీయ అవార్డ్స్ వస్తాయి. నాకు కూడా ఈ చిత్రానికి అవార్డ్స్ రావాలని కోరుకుంటున్నాను' అని తమన్నా చెప్పారు.