Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో శర్వానంద్ 30వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'ఒకే ఒక జీవితం'. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా ఈనెల 9న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
ఈ నేపథ్యంలో హీరో శర్వానంద్ మీడియాతో తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు.
'ఒకే ఒక జీవితం' విజయాన్ని బాగా ఆస్వాదిస్తున్నాను. చాలా సెన్సిబుల్ సినిమా చేశాం. ప్రేక్షకులు ఖచ్చితంగా సినిమాకి కనెక్ట్ అవ్వాలని బలంగా అనుకున్నాం. మేము ఊహించినట్లే సినిమా అందరికీ కనెక్ట్ అయ్యింది. విమర్శకులకు కూడా స్ట్రాంగ్ కంటెంట్ ఉండటంతో నచ్చింది. దర్శకుడు హను అయితే ఈ సినిమా పిల్లలకి ఎక్కువ చూపించాలని చెప్పారు. పిల్లల కోసం ఒక స్పెషల్ షో వేశాం. చాలా ఎంజారు చేశారు. అయితే ఇప్పుడు పిల్లలు చాలా స్మార్ట్. టైం ట్రావెల్లో ఎక్కడికి వెళ్తారని అడిగితే ప్రజంట్లోనే ఉంటామని చెబుతున్నారు. శ్రీకార్తిక్ చాలా అద్భుతమైన దర్శకుడు. భవిష్యత్లో చాలా పెద్ద దర్శకుడు అవుతాడు. మంచి కథ కుదిరితే భవిష్యత్లో తనతో మళ్ళీ పని చేస్తా. ఈ సినిమాతో అమల గారు నన్ను మూడో కొడుకు ఆనటం ఆనందంగా ఉంది.ఈ విషయంలో నేను లక్కీ. నీ కెరీర్లో ఎప్పటికీ గుర్తిండిపోయే సినిమా, చాలా గర్వంగా నీ లైబ్రెరీలో పెట్టుకునే సినిమా అని ఇంట్లో వాళ్ళు ప్రశంసించారు. కృష్ణ చైతన్యతో ఒక సినిమా చేస్తున్నా. ఇది పొలిటికల్ డ్రామా. మరో మూడు కథలు ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. వాటి వివరాలు త్వరలోనే తెలియజేస్తాను' అని శర్వా తెలిపారు.