Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శింబు కథానాయకుడిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా 'వెందు తనిందదు కాడు'.
ఇందులో సిద్దీ ఇధ్నానీ కథానాయిక. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి. కె. గణేష్ నిర్మించారు. ఈ చిత్రాన్ని 'ది లైఫ్ ఆఫ్ ముత్తు'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిందిహొప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్. నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ విడుదల చేశారు. సినిమాకుహొఅన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సందర్భంగా శనివారం మీడియాతో దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ, 'తొలుత తెలుగులో ఈ సినిమా విడుదల చేయాలనే ఆలోచన లేదు. 'స్రవంతి' రవికిశోర్ గారు ఫోన్ చేశారు. 'నేను పాటలు విన్నాను. బావున్నాయి. ట్రైలర్ చూశా. నాకు నచ్చింది. తెలుగులో కూడా విడుదల చేద్దాం' అన్నారు. నేను ఇంతకు ముందు తీసిన సినిమాలకు డిఫరెంట్ సినిమా ఇది. తెలుగు, తమిళ ప్రేక్షకుల నుంచి సినిమాకుహొమంచి స్పందన లభిస్తోంది.హొదీనికి సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉంది. రామ్హొహీరోగా వచ్చేహొఏడాది ఒక సినిమా చేస్తాను' అని తెలిపారు. 'ఈ సినిమా నాకెంతో నచ్చింది. అందుకే తెలుగు ప్రేక్షకులకు అందించాలని అనుకున్నాను. ఇంతకు ముందు మా సంస్థ ద్వారా 'నాయకుడు',హొ'పుష్పక విమానం', 'రెండు తోకల పిట్ట', 'రఘువరన్ బీటెక్' చిత్రాలు విడుదల చేశాం. ఆ సినిమాలహొతరహాలో ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది' అని నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ అన్నారు.