Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్ర గంటి కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. కృతిశెట్టి నాయిక. నిర్మాతలు బి.మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో ఈనెల 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన సక్సెస్ మీట్లో సుధీర్ బాబు మాట్లాడుతూ, 'ఇలాంటి గొప్ప సినిమా చేయడం చాలా గర్వంగా ఉంది. సినిమా చూసిన తర్వాత చాలా ప్రశంసలు వచ్చాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాకి కనెక్ట్ అవుతున్నారు. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. తండ్రి కూతుళ్ళు కలసి సినిమాకి వెళ్తే చాలా ఆనందిస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత అందరిలో ఒక పరిణితి వస్తుంది' అని తెలిపారు. 'ఇది నాకు మోస్ట్ స్పెషల్ ఫిల్మ్. ఈ సినిమాలో ఇప్పటి వరకూ నా బెస్ట్ ఫెర్ ఫార్మెన్స్ అని ప్రేక్షకులు అంటున్నారు. చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి' అని నాయిక కృతిశెట్టి చెప్పారు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ, 'ఈ సినిమాకి హార్ట్ వార్మింగ్ సక్సెస్ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ప్రేక్షకులకు వినోదం పంచడంతో పాటు ఒక కొత్త కోణాన్ని ప్రజంట్ చేయాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది' అని అన్నారు.