Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్న తనంలోనే మోడలింగ్ వైపు అడుగులు వేసి తన అందం, అభినయంతో పలు అందాల పోటీల్లో గెలిచి, తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు సొంతం చేసుకుంది నందిని రారు. 2011లో '040' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నందిని రారు 'మాయ', 'ఖుషి ఖుషీగా', 'మోసగాళ్లకు మోసగాడు', 'సిల్లీ ఫెలోస్', 'శివరంజని' వంటి విజయవంతమైన చిత్రాలలో నటించి తెలుగులో సహజ నటి అనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అలాగే బిగ్ బాస్ 2లో బెస్ట్ కంటెస్టెంట్‌గా నిలిచి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్‌తో అనేక తెలుగు సినిమాలతో పాటు కన్నడ, తమిళం, హిందీ, మలయాళంలో కూడా మంచి ఆఫర్లను నందిని రారు అందుకుంది. బాలీవుడ్లో 'ఫ్యామిలీ ప్యాక్' సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయిన నందిని 'నందీ' వంటి సినిమాలతో పాటు మలయాళంలో 'లాల్ భాగ్', 'గ్రహణం', కన్నడలో 'గుడ్‌బై డిసెంబర్', 'ఖుషి ఖుషి', 'యాగీ'.. ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ అనతికాలంలోనే అశేషమైన ప్రేక్షకాదరణ పొందిన నందిని రారు తన ఫ్యాన్స్ కోసం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. తాజాగా 'కోతి కొమ్మచి'్చ సినిమాలోని ఒక పాటలో నటించింది.
అలాగే రాధికా శరత్ కుమార్, సాయికుమార్ ప్రధానపాత్రలలో నటించిన 'గాలి వాన' వెబ్ సిరీస్‌లో పోలీస్ ఆఫీసర్‌గా నటించి మెప్పించింది. 'హై ప్రీస్ట్, షఉట్ యట్ అలైర్, మెట్రో' కథలతో యాంతాలజీ సిరీస్ చేసింది. అలాగే 'ఇన్ ద నేమ్ అఫ్ గాడ్' వెబ్ సిరీస్‌లోనూ నటించిన నందిని బర్త్ డే వేడుకలు హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది. 'ఏ భాషల్లో నటించినా ప్రేక్షకుల్ని అలరించడమే నా లక్ష్యం. భిన్న పాత్రల పోషణతో పాన్ ఇండియా నటిగా అందరి ఆదరణ పొందాలని ఆకాంక్షిస్తున్నాను. నా బర్త్‌డేకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు' అని నందిని రారు తెలిపింది.