Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల 'విశ్వక్' సినిమాతో నటుడిగా తనదైన ముద్ర వేసిన అజయ్ కతుర్వార్ మరో కొత్త చిత్రం 'అజయ్ గాడు'తో ప్రేక్షకులను ఉత్తేజ పరిచేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవల అధికారికంగా విడుదల చేసిన టైటిల్, ఫస్ట్ లుక్‌కి అద్భుత స్పందన లభించింది. 'అజయ్ గాడు' పవర్ ప్యాక్డ్ టీజర్‌తో ఆదివారం మేకర్స్ అందరినీ ఆశ్చర్య పరిచారు. అజయ్ కతుర్వార్ ప్రేమ గురించి చమత్కారమైన డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. అందులో అతను తన ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. అందరి దష్టిని ఆకర్షించడానికి అద్భుతమైన విజువల్స్‌తో యాక్షన్‌లో అజయ్ కతుర్వార్ ఫ్లాష్ కట్స్ లో కనిపిస్తారు. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్ల పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌తో అందరిలోనూ ఈ టీజర్ ఆసక్తిని రేకెత్తించింది. ఇంటెన్స్ యాక్షన్, అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అజరు కతుర్వార్ ఇంటెన్స్ లవ్ స్టోరీతో వస్తున్నట్లు ఈ టీజర్ చెప్పకనే చెప్పింది. ఈ ప్రాజెక్ట్‌కి అజరు కతుర్వార్ దర్శకత్వం వహించారు. అంతేకాకుండా చందనా కొప్పిశెట్టి సహకారంతో అజయ్ కుమార్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయనే స్వయంగా నిర్మించారు. భాను శ్రీ, శ్వేతా మెహతా కథానాయికలుగా నటిస్తున్న ఈచిత్రానికి సినిమాటోగ్రఫీ : అజయ్ నాగ్, హర్ష హరి జాస్తి, సంగీతం : కార్తీక్ కొడకొండ్ల, మనీజేన, సుమంత్ బాబు, ప్రతీక్, నేపథ్య సంగీతం : సిద్ధార్థ్ శివుని, ఫైట్స్ : పధ్వీ.