Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు ఆది సాయికుమార్ తాజాగా నటిస్తున్న సినిమా 'టాప్ గేర్'. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టైటిల్ లుక్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది. వేలాది మంది స్టూడెంట్స్ సమక్షంలో ఈ చిత్ర టైటిల్ లోగో లాంచ్ చేసి యూత్ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేసిన చిత్ర యూనిట్, తాజాగా చిత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్లో ఆది సాయి కుమార్ లుక్ చూస్తుంటే సినిమాలో ఏదో తెలియని పాయింట్ టచ్ చేశారని తెలుస్తోంది. అలాగే వినూత్నంగా ఆలోచించి తొలిసారి 3డి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ హైలైట్ అయ్యాయి. 'టాప్ గేర్' అనే టైటిల్‌కి తగ్గట్లుగా హీరో ఆది సాయి కుమార్‌తో ఈ పోస్టర్ డిజైన్ చేసిన విధానం ఈ వీడియోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇప్పటిదాకా విడుదల చేసిన అప్ డేట్స్ చూస్తుంటే ఈ సినిమాలో అన్ని వర్గాల ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ చూపించబోతున్నారని స్పష్టమవుతోంది. ఈ సినిమా తన కెరీర్లో ఎంతో ప్రత్యేకం కానుందని హీరో ఆది సాయి కుమార్ చెప్పడం సినిమాపై అంచనాలు పెంచేసింది.
ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అన్ని హంగులతో ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమాలో రియా సుమన్ హీరోయిన్గా నటిస్తోంది.
'ఆదిసాయికుమార్ కెరీర్లోనే ఈ సినిమా ది బెస్ట్ సినిమాగా నిలుస్తుంది. ఇందులో ఆదిగారి క్యారెక్టర్ చాలా వినూత్నంగా ఉంటుంది. అన్ని హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తుంది. ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం' అని మేకర్స్ తెలిపారు. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర, రేడియో మిర్చి హేమంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శశికాంత్, సినిమాటోగ్రాఫర్: సాయి శ్రీరామ్, మ్యూజిక్: హర్ష వర్ధన్ రామేశ్వర్, ఎడిటర్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: రామాంజనేయులు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి, ప్రొడ్యూసర్: కె.వి.శ్రీధర్ రెడ్డి.