Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో విలక్షణమైన ప్రేమకథగా వచ్చిన చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. సుధీర్ బాబుకు జోడిగా కృతిశెట్టి నటించారు. బెంచ్‌మార్క్ స్టూడియోస్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని బి.మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి నిర్మించారు. గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో ఈనెల 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మీడియాతో ఈ సినిమా సక్సెస్ విశేషాలను హీరోయిన్ కృతిశెట్టి షేర్ చేసుకున్నారు.
'ఈ సినిమాలో నా పాత్రకు చాలా మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది. నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉన్న పాత్ర ఇది. అందుకే ప్రేక్షకులు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. నా పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఈ సినిమాకే కాదు ప్రతి సినిమాలోని పాత్ర కోసం నేను హౌం వర్క్ చేస్తాను. పాత్రని వివరంగా రాసుకుంటాను. అప్పుడు ఆ పాత్రని అభినయించడం చాలా ఈజీ అవుతుంది. సెట్లో ఒక సీన్ జరుగుతున్నపుడు నిజంగానే అది నా జీవితంలో జరుగుతుందని చేస్తాను.
ఇలా చేసినప్పుడు చాలా సహజమైన హావ భావాలు పలుకుతాయని నమ్ముతాను. ఈ పాత్రని కూడా అలానే చేశాను.అలాగే నా కెరీర్లో తొలిసారి ద్విపాత్రాభినయం చేయడం చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అఖిల పాత్రని చాలా మంది ఇష్టపడుతున్నారు. నిజానికి నేను డాక్టర్ కావాలని అనుకున్నాను. ఒక యాడ్ ఫిల్మ్ కోసం హైదరాబాద్ రావడం, తొలి సినిమా 'ఉప్పెన'లో అవకాశం దొరకడం, తర్వాత మంచి మంచి పాత్రలు దక్కడం అదష్టంగా భావిస్తున్నాను. చాలా మంది ఫోన్ చేసి 'నన్ను నేను స్క్రీన్ పై చూసుకున్నట్లు ఉంది' అని చెబుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఒక నటికి ఇంతకంటే కావాల్సింది ఏముంది?, ఇంత మంచి పాత్రని ఇచ్చిన ఇంద్రగంటి గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా విజయం నాకు చాలా ప్రత్యేకం. నిర్మాత కిరణ్ గారు చాలా సెన్సిబుల్. కథపై ఆయనకి మంచి అభిప్రాయాలు ఉన్నాయి. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన కిరణ్ గారికి కృతజ్ఞతలు. చాలా ప్రత్యేకమైన పాత్ర చేశాను. పదేళ్ళ తర్వాత కూడా గుర్తుంటుంది. ఇక సుధీర్‌బాబు, ఇంద్రగంటి గారిది పాపులర్ కాంబినేషన్. సెట్స్‌లో నాది, సుధీర్ బాబు గారి కంటే సుధీర్, ఇంద్రగంటి గారి కెమిస్ట్రీ బావుంటుంది (నవ్వుతూ). సుధీర్, ఇంద్రగంటి గారి మధ్య గ్రేట్ వర్క్ ఎనర్జీ ఉంటుంది. ఇంద్రగంటి గారి సినిమా చిత్రీకరణ స్పెషల్‌గా ఉంటుంది. దాదాపు 70 రోజులు ఈ సినిమా కోసం పని చేశాను. ఇంద్రగంటి గారు చాలా కూల్. తన పనిని చాలా ఎంజారు చేస్తారు. సెట్‌కి ప్రతి రోజు ఫ్రెష్ మైండ్‌తో వస్తారు. చాలా అంశాలు ఆయన నుండి నేర్చుకున్నాను. అలాగే సుధీర్ బాబు గారు వండర్ ఫుల్ కోస్టార్. చాలా అంకిత భావంతో పని చేస్తారు. చాలా స్ఫూర్తి నింపుతారు. సెట్స్‌లో ఎంతో సహాయంగా ఉంటారు.