Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏజె ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూరెడ్డి విష్ణు సమర్పణలో తెరకెక్కిన చిత్రం 'రణస్థలి'. పరశురాం శ్రీనివాస్ దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ను సోమవారం అగ్ర కథానాయకుడు వెంకటేష్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'టీజర్ చాలా బాగుంది. కొత్త డైరెక్టర్ పరశురాం చాలా బాగా డైరెక్ట్ చేశారు. వయలెన్స్ బ్యాక్ డ్రాప్‌తో చాలా బాగా తీశారు. డైలాగ్స్ చాలా పవర్ ఫుల్‌గా ఉన్నాయి. మ్యూజిక్‌తోపాటు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి' అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు పరశురాం శ్రీనివాస్, నిర్మాత సూరెడ్డి విష్ణు, కో ప్రొడ్యూసర్ లక్ష్మీజ్యోతి శ్రీనివాస్, కెమెరామెన్ జాస్టి బాలాజీ, హీరో ధర్మ, హీరోయిన్ చాందిని రావు, ప్రశాంత్, శివ, అశోక్ సంగా, అసిస్టెంట్ డైరెక్టర్ మూర్తి, కెమెరా అసిస్టెంట్ సాయి తదితరులు పాల్గొన్నారు.