Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై త్రిగుణ్, మేఘా ఆకాష్, మాయ, అజరు కతుర్వార్, శివ రామచంద్ర, తనికెళ్ళ భరణి, వైవా హర్ష నటీనటులుగా నటిస్తున్న చిత్రం 'ప్రేమదేశం'. మధుబాల ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. నూతన దర్శకుడు శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వంలో శిరీష సిద్ధమ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ 'తెలవారెనే సామి'ను ఆదివారం ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర బృందం రిలీజ్ చేసింది.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ సిద్ధమ్ మాట్లాడుతూ,'ఈ కథను టీమ్ అందరూ బిలీవ్ చేయడంతో సస్సెస్ ఫుల్‌గా పూర్తి చేయగలిగాను. డి.ఓ.పి. సజాద్ కాక్కు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. కిరణ్ తన చక్కటి ఎడిటింగ్‌తో సినిమాకు స్పీడ్ పెంచారు' అని తెలిపారు.
'మదర్ సెంటిమెంట్‌తో చేసిన సినిమాలు నాకు మంచి పేరు తెచ్చాయి. ఇందులో మధుబాల నాకు మదర్‌గా చేశారు. కాలేజ్ డేస్‌ను గుర్తు చేసే సినిమా ఇది. అక్టోబర్‌లో విడుదల అవుతున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి' అని హీరో త్రిగుణ్ తెలిపారు. హీరోయిన్ మేఘా ఆకాష్ మాట్లాడుతూ, 'ఒకప్పటి బ్లాక్ బస్టర్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాలో నటించటం హ్యాపీగా ఉంది' అని అన్నారు.