Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డి.సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్, సునీత తాటి గురు ఫిలింస్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం 'దొంగలున్నారు జాగ్రత్త'. శ్రీ సింహ కోడూరి కథానాయకుడు. ప్రీతి అస్రాణి కథానాయిక. సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం ఈనెల 23న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో నాయిక ప్రీతి అస్రాణి మీడియాతో మాట్లాడుతూ, 'ఇదొక యూనిక్ కథ. ఇలాంటి సినిమా తెలుగులో ఇప్పటివరకూ రాలేదు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో పాటు డిఫరెంట్ ఫిల్మ్ మేకింగ్ కూడా ఉంది. ఇందులో నీరజగా ఒక ఛాలెంజింగ్ పాత్ర చేశాను. కథలో చాలా కీలకమైన పాత్ర ఇది. చాలా ఎమోషన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ప్రతి మహిళ నా పాత్రకు కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో మిడిల్ క్లాస్ కుటుంబంలో జరిగే నేచురల్ విజువల్స్ ఉంటాయి. చాలా ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసే పాత్ర నాది. దర్శకుడు సతీష్ నా పాత్రని అద్భుతంగా డిజైన్ చేశారు. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను. తెలుగులో మరో రెండు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అలాగే అన్నపూర్ణ వారి ఒక వెబ్ సిరిస్ ఉంది' అని చెప్పారు.