Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం 'అల్లూరి'. ఈ చిత్రంతో ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బెక్కెం బబిత సమర్పిస్తున్నారు. ఈనెల 23న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ మాట్లాడుతూ, 'బెక్కెం వేణుగోపాల్ 'ప్రేమ ఇష్క్ కాదల్' నుండి ఇప్పటివరకూ ప్రతి సినిమాని ఫాలో అవుతుంటాను. ఆయన మరిన్ని మంచి సినిమాలు తీసి తెలుగు సినిమా స్థాయిని పెంచాలి. శ్రీవిష్ణు నాకు ఇష్టమైన వ్యక్తి. విష్ణుకి మంచి అభిరుచి ఉంది. ఆయన చేసే సినిమాల్లో కొత్తదనం ఉంటుంది. సినిమా కోసం చాలా అంకిత భావంతో పని చేసే హీరో. ఆయన ప్రతి సినిమా విజయం సాధించి, ఇంకా మంచి స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మంచి కంటెంట్ వున్న చిత్రాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమా మంచి కంటెంట్‌తో వస్తోంది' అని అన్నారు.
'అల్లూరి కథని ఐదేళ్ళుగా నమ్మి ఇక్కడి వరకూ తీసుకొచ్చాం. దీనికి ప్రధాన కారణం మా దర్శకుడు ప్రదీప్ వర్మ. ఇది చాలా వైవిధ్యమైన పోలీస్ స్టొరీ. ఇరవై ఏళ్ళ లైఫ్ టైంని ఈ కథలో చాలా అద్భుతంగా చూపించబోతున్నాం. ఫిక్షనల్ క్యారెక్టర్. కానీ సంఘటనలు మాత్రం అన్నీ నిజంగా జరిగినవే. ప్రతిఒక్కరూ చూడాల్సిన సినిమా. చివరి అరగంట చూసి బయటికి వచ్చిన ప్రేక్షకులకు ఒక రెండు రోజుల పాటు సినిమా వెంటాడుతుంది. చాలా మంచి సినిమా చేశాం. అందరూ తప్పకుండా చూడాలి' అని హీరో శ్రీవిష్ణు చెప్పారు. నిర్మాత బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ,'అల్లు అర్జున్ గారు ఈ ఈవెంట్‌కి రావడం నా జీవితంలో మర్చిపోలేను. ఈ సినిమాని ఎక్కడ రాజీపడకుండా నిర్మించాను. చాలా మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. ఈనెల 23న ప్రేక్షకులు చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను' అని తెలిపారు.