Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధనుష్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం 'సార్'. ఈ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్)తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రానికి సమర్పకునిగా వ్యవహరిస్తోంది. ఇందులో ధనుష్‌తో సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం 'సార్' (తెలుగు) 'వాతి', (తమిళం) చిత్రీకరణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 2న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు సోమవారం ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేశారు. విద్యావ్యవస్థ తీరు తెన్నుల మీదుగా కథానాయకుడు సాగించే ప్రయాణం అందులోని సమస్యలు, సంఘటనలు 'సార్' జీవితాన్ని ఏ తీరానికి చేర్చాయన్నది అటు ఆసక్తిని, ఇటు ఉద్విగతకు గురి చేస్తుంది. సాయికుమార్, తనికెళ్ల భరణి, సముద్ర ఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, సార, ఆడుకాలం నరేన్, ఇలవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పేరడి, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, ఎడిటర్: నవీన్ నూలి, సినిమాటోగ్రాఫర్: జె.యువరాజ్, మ్యూజిక్: జి.వి. ప్రకాష్‌కుమార్, యాక్షన్ కొరియోగ్రాఫర్: వెంకట్.