Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేషనల్ అవార్డ్ విన్నర్, కోలీవుడ్ స్టార్ కథానాయకుడు ధనుష్ నటిస్తున్న భారీ పీరియాడికల్ చిత్రం 'కెప్టెన్ మిల్లర్'.
1930-40ల నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందుతోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై టి.జి.త్యాగరాజన్ సమర్పణలో సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌లు సహ నిర్మాతలు.
భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. ఇటివలే హీరో సందీప్ కిషన్ ఒక కీలక పాత్ర కోసం ఈ ప్రాజెక్ట్‌లో చేరారు. తాజాగా 'కెప్టెన్ మిల్లర్' కథానాయికలు ఖరారైయ్యారు. ఈ చిత్రంలో ధనుష్‌కి జోడిగా ఇద్దరు కథానాయికలు ప్రియాంక మోహన్, నివేదిత సతీష్ నటిస్తున్నట్టు నిర్మాతలు అధికారక ప్రకటన చేశారు.
'కెప్టెన్ మిల్లర్' గురించి సోషల్ మీడియా వేదికగా ప్రియాంక మోహన్ ఆనందం వ్యక్తం చేశారు. 'ఇంత భారీ ప్రాజెక్ట్‌లో భాగం కావడం, ధనుష్ గారితో జోడిగా నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. అరుణ్ మాథేశ్వరన్, సత్యజ్యోతి ఫిల్మ్స్‌కి కృతజ్ఞతలు. ఈ సినిమా చిత్రీకరణ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చుస్తున్నా' అని ట్వీట్ చేశారు.
'నా మనసుకు దగ్గరైన ఒక అద్భుతమైన క్యారెక్టర్ని చేయడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. నాపై నమ్మకం ఉంచినందుకు కెప్టెన్ మిల్లర్ టీంకి కతజ్ఞతలు. గొప్ప స్ఫూర్తినిచ్చే ధనుష్ గారితో నటించే అవకాశం రావడం నమ్మశక్యం కావడం లేదు. ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఆతృతగా వేచి చూస్తున్నా' అని నివేదిత సతీష్ ట్వీట్లో పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.
ఈ చిత్రానికి రచయిత, దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్, నిర్మాతలు: జి. శరవణన్, సాయి సిద్ధార్థ్, సమర్పణ: టీజీ త్యాగరాజన్, సంగీతం: జివి ప్రకాష్ కుమార్, డీవోపీ: శ్రేయాస్ కృష్ణ, ఎడిటర్: నాగూరన్, ఆర్ట్: టి.రామలింగం.