Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డి.సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్, సునీత తాటి గురు ఫిలింస్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం 'దొంగలున్నారు జాగ్రత్త'. శ్రీ సింహ కోడూరి కథానాయకుడు. ప్రీతి అస్రాని కథానాయిక. సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈనెల 23న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో హీరో శ్రీ సింహ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
''దొంగలున్నారు జాగ్రత్త' సినిమా చేయడానికి కారణం కథ చాలా గ్రిప్పింగా అనిపించింది. చాలా కొత్త జోనర్. ఎక్కడా సాగదీత లేకుండా బలమైన సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ కథని రాసుకున్నారు దర్శకుడు సతీష్. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్ బ్యానర్స్ వుండటం కూడా ఆసక్తిని కలిగించింది. ఇందులో దొంగగా కనిపిస్తా, ఈ కథలోనే ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. ఒక దొంగగా వచ్చిన వ్యక్తి చివరికి ఎలా మారాడు?, తన తప్పులని ఎలా తెలుసుకున్నాడనేది కూడా సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు. అయితే మంచి దొంగలా చూపించడం మాత్రం ఇందులో ఉండదు. చాలా సహజంగా దొంగని దొంగగానే చూపించాం. దొంగని చూస్తే చిరాకు వస్తుంది. అదే సమయంలో అతను తప్పు తెలుసుకున్నపుడు జాలి కూడా కలుగుతుంది. కథ మొత్తం ఒకే లొకేషన్లో జరుగుతుంది. అయితే కథ చాలా ఎగ్జైటింగ్‌గా ఉంటడంతో ఒకే లొకేషన్ అనే ఫీలింగ్ రాలేదు. ప్రేక్షకులు సినిమా చూస్తున్నపుడు కూడా ఈ ఎగ్జైట్మెంట్ ఫీలౌతారు. ఈ సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉంది. ప్రతి సీన్ ఇంట్రెస్టింగ్గా నడుస్తుంటుంది. తెలుగులో తొలిసారి వస్తున్న సర్వైవల్ థ్రిల్లర్ ఇది. ఇలాంటివి హాలీవుడ్లో ఎక్కువగా వస్తుంటాయి. బాలీవుడ్లో కూడా వచ్చాయి. ఈ జోనర్లో తెలుగులో ఫస్ట్‌టైమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం. సతీష్ త్రిపుర రామానాయుడు ఫిలిం ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్స్ చేశారు. సురేష్ ప్రొడక్షన్లో కొన్ని చిత్రాలకు అసోషియేట్గానూ పని చేశారు. ఆయన చాలా క్లియర్ విజన్‌తో ఈ కథ రాసుకున్నారు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా స్క్రీన్ మీదకి రప్పించగలిగారు. ఈ సినిమా చూసిన తర్వాత రాజమౌళి గారు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. చిన్న చిన్న మార్పులు సూచించారు. ఆ మార్పులు చేసిన తర్వాత సినిమా ఇంకా స్ట్రాంగ్ అయ్యింది. ప్రస్తుతం 'భాగ్ సాలే', 'ఉస్తాద్' సినిమాలు చేస్తున్నా' అని శ్రీ సింహ తెలిపారు.