Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం 'కష్ణ వ్రింద విహారి'. ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈనెల 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ, 'దర్శకుడు అనీష్ కష్ణ చాలా మంచి కథ చెప్పారు. అద్భుతంగా తీశారు. నాకు మంచి సినిమా ఇవ్వబోతున్నారనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో ఒక కీలకమైన సన్నివేశం ఉంది. సినిమా లైఫ్‌ని నిర్ణయించే సన్నివేశం అది. ఆ ఒక్క సీన్ లక్ష్మీ భూపాల గారు అద్భుతంగా రాశారు. ఆయనకి ప్రత్యేకమైన కతజ్ఞతలు. మహతి సాగర్ చాలా మంచిమ్యూజిక్ ఇచ్చారు. విజరు గారు పాటలని చాలా బ్యూటీఫుల్‌గా కోరియోగ్రఫీ చేశారు. కాసర్ల శ్యామ్ మంచి సాహిత్యం అందించారు. శెర్లీ చాలా మంచి నటి. అందంగా పాడుతుంది కూడా. తనతో నటించడం ఆనందంగా ఉంది. రాధిక గారు లేకపోతే ఈ సినిమా చేసేవాడిని కాదు. ఈ సంగతి రాధిక గారికి కూడా చెప్పాను. ఆ పాత్ర రాధిక గారు కాకుండా ఎవరూ చేయలేరు. మా సినిమా చేసినందుకు ఆమెకు కతజ్ఞతలు. ఈ సినిమా కోసం పాదయాత్ర చేశాను. అన్ని ఊర్లు తిరిగాను. కంటెంట్ బావుంది కాబట్టి ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి నిలబడ్డాను. ఈ సినిమా చాలా బావుందని నిజాయితీగా నమ్ముతున్నాను. ఈ సినిమా చూడండి. హిట్టా, సూపర్ హిట్టా, బ్లాక్ బస్టరా, లేదా ఫ్లాప్ .. ఫలితం ఏదైనా శిరస్సు వంచి తీసుకుంటాను' అని చెప్పారు.
'ట్రైలర్ చాలా నచ్చింది. ఫ్యామిలీ అంతా కలిసి చూసి, నవ్వుకునేలా కనిపించింది. దర్శకుడు అనిష్లో నాకు బాగా నచ్చేది నవ్వు. ఎలాంటి పరిస్థితిలో కూడా నవ్వుతునే ఉంటాడు. నిర్మాత ఉషా, శంకర్ గారు నాకు బాగా కావాల్సిన వారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలి, మరిన్నీ మంచి సినిమాలు తీయాలి. శౌర్య హార్డ్ వర్కింగ్ హీరో. విభిన్నమైన జోనర్స్లో ప్రయాణం చేస్తున్నారు. ఈ సినిమా శౌర్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అవుతుంది' అని అనిల్ రావిపూడి అన్నారు.
అనీష్ ఆర్ కష్ణ మాట్లాడుతూ, 'నాగశౌర్యకి కతజ్ఞతలు. నేను కథ చెప్పిన వెంటనే కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి షూటింగ్ మొదలుపెట్టారు. సినిమా ఆయనకి నచ్చింది. బలంగా నమ్మారు. ఆ నమ్మకంతోనే పాదయాత్ర చేసి ఊరూరా తిరుగుతున్నారు. సినిమాపై ఆయనకి వున్న నమ్మకం ప్రజల్లో కలిగించాలానే ఆలోచన నిజంగా అద్భుతం. ఐరా క్రియేషన్స్ ఉషా, శంకర్ గారికి ప్రత్యేక కతజ్ఞతలు. వారు ధైర్యంగా నిలబడటం వలనే సినిమా ఇంత గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలూ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకంతో మేమంతా ఉన్నాం' అని తెలిపారు.