Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందమూరి బాలకృష్ణ నటించిన 'చెన్నకేశవ రెడ్డి' సినిమా థియేటర్స్‌లో మాస్ జాతర సృష్టించింది. వివి.వినాయక్ దర్శకత్వంలో సెప్టెంబర్ 25, 2002లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. 20 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఏ మాత్రం క్రేజ్ తగ్గని ఈ చిత్రాన్ని ఇప్పుడు సరికొత్త హంగులతో రీ-రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత బెల్లం కొండ సురేష్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ, ''చెన్నకేశవ రెడ్డి'ని భారీగా రీ-రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇరవైఏళ్ల కిందట ఎంత హైబడ్జెట్‌తో, క్రేజీగా ఈ సినిమాని నిర్మించామో, అంతే క్రేజీగా ఇప్పుడు సినిమాని రీరిలీజ్ చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులందరూ మళ్ళీ చూసి అదే థ్రిల్ ఫీలౌతారని నమ్ముతున్నాను. రీరిలీజ్ గురించి బాలకృష్ణకి చెప్పగానే ఆయన సపోర్ట్‌ని తెలియజేశారు. ఎక్కడ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసినా ఒక అరగంటలో ఫుల్ అయిపోయి మళ్ళీ షోలు పెంచే పరిస్థితి ఉండటం గొప్ప ఎనర్జీ ఇస్తుంది. ఈనెల 24న ప్రీమియర్ షోలతో మొదలుపెట్టి, 25న రెగ్యులర్ షోలు వేస్తాం. రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 300 థియేటర్స్‌లో సినిమాని ప్రదర్శిస్తున్నాం. సినిమాని సరికొత్తగా డిఐతో పాటు 5.1 హంగులతో తీర్చిదిద్దాం. ఈ సినిమాకి వచ్చే రెవెన్యూలో 75 శాతం బాలకృష్ణ గారి బసవతారకం ట్రస్ట్‌కి, మిగతాది నాకు సంబంధించిన అసోషియేషన్స్కి ఇవ్వాలని నిర్ణయించాం' అని తెలిపారు.
'అప్పటికి రెండో సినిమానే చేస్తున్న నాకు బాలయ్య ఎంతో మర్యాద ఇచ్చారు. ఈ సినిమానే రీ-రిలీజ్ చేయాలని అభిమనులు పట్టుబట్టారు. చాలా మంచి ఉద్దేశ్యం కోసం ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం' అని వి.వి.వినాయక్ చెప్పారు.