Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుంకర బ్రదర్స్ వారి సమర్పణలో అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'పగ పగ పగ'. రవి శ్రీ దుర్గా ప్రసాద్ దర్శకత్వంలో సత్య నారాయణ సుంకర నిర్మించారు. ఈ నెల 22న ఈ సినిమా రిలీజై, అన్ని థియేటర్స్‌లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.
ఈ సందర్బంగా దర్శకుడు రవి శ్రీ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ, 'నేను ఈ రోజు డైరెక్టర్ కావడానికి కారణమైన మా దర్శక గురువులకు, నిర్మాతలకు ధన్యవాదములు. సంగీత దర్శకుడు కోటి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తూనే అద్భుతంగా నటించారు. ఫుల్ లవ్, కామెడీ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి కంటెంట్‌తో విడుదలైన మా సినిమా అన్ని థియేటర్స్‌లో విజయవంతంగా ఆడుతోంది. చూడని వారు చూసి మమ్మల్ని, మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
'నేను ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కావడానికి కారణమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు. నేను 'దేవినేని' సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించాను. ఆ తర్వాత చిరంజీవి సైతం ఆర్టిస్ట్‌గా చేయమని బ్లెస్సింగ్ ఇచ్చారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా చేద్దాం అని వచ్చిన నన్ను ఇందులో యాక్టింగ్ కూడా చేయించారు. సినిమా బాగా వచ్చింది. విడుదలైన అన్ని థియేటర్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్న మా సినిమాను ఇంకా పెద్ద విజయం సాధించేలా ప్రేక్షకులు ఆశీర్వదించాలని ఆశిస్తున్నాను' అని సంగీత దర్శకుడు కోటి చెప్పారు.
నిర్మాతలు సత్య నారాయణ సుంకర, ఫైట్ మాస్టర్ రామ్ సుంకర మాట్లాడుతూ, 'మా స్టంట్ మాస్టర్ యూనియన్ సపోర్ట్ వల్లే మేం ఈ సినిమా తీశాం. కోటితో వర్క్ చేసే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. మా తమ్ముడు హీరోగా అద్భుతంగా నటించాడు. మంచి కంటెంట్‌తో వచ్చిన మా సినిమాను అదిరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు.అన్ని థియేటర్స్‌లో కూడా ప్రేక్షకులు ఫుల్ ఎంటర్టైన్ అవుతున్నారు' అని తెలిపారు.