Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చమన్ సాబ్ జీవితం వెండితెరపై రానుంది. నేటి యువతకు స్ఫూర్తినిచ్చే చిత్రంగా దీన్ని 'చమన్' పేరుతో నిర్మిస్తున్నారు. వెంకట్ సన్నిధి దర్శకుడు. జి.వి. 9 ఎంటర్టైన్మెంట్ పతాకంపై జివి చౌదరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి నిర్మాత జి.వి.చౌదరి మాట్లాడుతూ,'నేను ఎంతగానో అభిమానించే వ్యక్తి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దూదేకుల చమన్ సాబ్. ఆయన కుమారుడు ఉమర్ ముక్తర్ బర్త్ డే కానుకగా మూవీ టైటిల్ని ఎనౌన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మా సినిమా టైటిల్ పేరు 'చమన్' (ఎడారిలో పుష్పం) ఈ సినిమా అందరిని అలరిస్తుంది' అని తెలిపారు.
'ఒక మహనీయుడి జీవిత చరిత్రతో రూపొందే చిత్రానికి నేను డైరెక్ట్ చేయటం అదష్టంగా భావిస్తున్నాను. చమన్ సాబ్ గురించి చెప్పాలంటే తన కుటుంబ భవిష్యత్ అన్నింటిని ఫలంగా పెట్టి ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేసిన వ్యక్తి. ఆయన జీవిత కథ ఆధారంగా కమర్షియల్ హంగులతో పాటు నిజాన్ని నిక్కచ్చిగా తెర మీద చూపించబోతున్నాం. టెన్త్ క్లాస్ కూడా పాస్ కానీ ఒక వ్యక్తి ఎన్నో కష్టాలు పడి చిన్న స్థాయి నుంచి ఇండియాలోనే బెస్ట్ జెడ్పీ చైర్మన్గా అవార్డు తెచ్చుకోవడం గొప్ప విషయం. కుల, మతాలకు అతీతంగా సేవ చేసిన వ్యక్తి కూడా. అనంతపురంలో ఒక ఎడారి లాంటి జిల్లాని మెరుగైన స్థాయికి తీసుకురావడంతో ఈ సినిమాకి 'చమన్' (ఎడారిలో పుష్పం) అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఎవ్వరినీ కించపరచని విధంగా ఈ సినిమాని రూపొందిస్తాం. నిర్మాతతో నాకు మంచి అనుబంధం ఉంది' అని దర్శకుడు వెంకట్ సన్నిధి అన్నారు.