Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సనాతన దృశ్యాలు పతాకంపై ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా నటిస్తున్న సినిమా 'బలమెవ్వడు'.
ఈ చిత్రానికి సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు.
సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్ బి మార్కండేయులు నిర్మిస్తున్నారు. పృథ్విరాజ్, సుహాసిని, నాజర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుండి విడుదలైన టీజర్, ఎం.ఎం.కీరవాణి పాడిన టైటిల్ సాంగ్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 1 న గ్రాండ్‌గా ప్రేక్షకులకు ముందుకు వస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ వినూత్నమైన రీతిలో 'బలమెవ్వడు' ట్రైలర్‌ను లాంచ్ చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పృధ్వీ మాట్లాడుతూ,'మెడికల్ మాఫియా ఒక కామన్ మ్యాన్‌ను ఎంతగా నలిపేస్తుంది?,. దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే పాయింట్‌తో చాలా ఇంట్రెస్ట్‌తో వస్తున్న ఈ సినిమాను దర్శక, నిర్మాతలు చాలా కష్టపడి తీశారు. సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే ఇలాంటి సినిమాలకు అందరి బ్లెస్సింగ్స్ కావాలి' అని తెలిపారు.
'మెడికల్ మాఫియా కథతో మొదలు పెట్టిన మాకు కోవిడ్ వచ్చింది. దీంతో మాకు సపోర్ట్‌గా నిలిచిన నిర్మాతలు వెనక్కి వెళ్లడంతో మేము చాలా ఇబ్బంది పడ్డాం .మా అమ్మ, నాన్న నా సినిమా ఆగిపోకూడదని ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి నాకు సపోర్ట్‌గా నిలిచి, సినిమాను పూర్తి చేశారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశాం. మెసేజ్ తో పాటు ప్రేక్షకులకు నచ్చే అద్భుతమైన ప్రేమ కథ, సున్నితమైన హాస్యం కలగలపి తీసిన ఈ సినిమాను ఫ్యామిలీ అందరూ వచ్చి చూసేలా చిత్రీకరించాం. మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్‌తో థియేటర్స్‌కు వచ్చిన ప్రేక్షకులకు పెద్ద సినిమా చూసిన ఫీల్ కలుగుతుంది. సుహాసిని 'రాఖీ' సినిమా తర్వాత అంత పవర్ ఫుల్ రోల్ మా సినిమాలో చేయడం చాలా గర్వంగా ఉంది. పథ్వీ గారితో పాటు హీరో, హీరోయిన్లకు అవార్డు వస్తుందనే నమ్మకం కలిగింది. మంచి కంటెంట్‌తో అక్టోబర్ 1 వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని దర్శకుడు సత్య రాచకొండ అన్నారు.