Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెల్లంకొండ గణేష్‌ను హీరోగా పరిచయం చేస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'స్వాతి ముత్యం'. వర్ష బొల్లమ్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విజయ దశమి కానుకగా అక్టోబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు లక్ష్మణ్ మీడియాతో సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
'మాది తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం. స్కూల్లో చిన్న చిన్న డ్రామాలు రాసేవాడిని. సినిమాల మీద ఇష్టంతో ఇంజనీరింగ్‌ని మధ్యలో వదిలేసి హైదరాబాద్ వచ్చేశాను. హైదరాబాద్ రాకముందే షార్ట్ ఫిలిమ్స్ చేశా. రూ.3 వేల లోపు బడ్జెట్‌తో 'లాస్ట్ విష్' అనే షార్ట్ ఫిల్మ్ చేశా. అది చూసి ఒకాయన లక్షా 30 వేలు బడ్జెట్ పెట్టడంతో 'కృష్ణమూర్తి గారింట్లో' అనే షార్ట్ ఫిల్మ్ చేశాం. దానికి మంచి ఆదరణ లభించింది. సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్‌లో బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు వచ్చింది. 'సదా నీ ప్రేమలో' అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశా. దానికి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ఈ సినిమాకి డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. మన చుట్టూ జరిగే సంఘటనల నుంచే ఈ కథ పుట్టింది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఎలా స్పందిస్తారు?, పక్కింటి వాళ్ళు ఎలా స్పందిస్తారు?, ఎవరి ఎమోషన్స్ ఎలా ఉంటాయి? ఇలాంటివన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఈ సినిమాలో అబ్బాయి పేరు బాల మురళి కృష్ణ. ఇంజనీరింగ్ పూర్తి చేసి చిన్న టౌన్లో అప్పుడే జూనియర్ ఇంజనీర్‌గా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న ఒక యువకుడి కథే ఈ చిత్రం. జాబ్ రాగానే ఇంట్లో వాళ్ళు పెళ్లి చేద్దామని సంబంధాలు చూడటం మొదలుపెడతారు. ఒక సాధారణ పెళ్లిలో కూడా ఎన్ని కష్టాలు ఉంటాయనేది ఆసక్తికరంగా చూపించబోతున్నాం. నేను ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని కొత్త వాళ్ళతో చేయాలనుకున్నాను. అప్పుడే గణేష్ స్టోరీలు వింటున్నాడు. ఈ కథ చెప్పడంతో గణేష్‌కి బాగా నచ్చింది. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ సురేష్ గారికి చెప్పడం, ఆయనకు కూడా నచ్చడం. అక్కడి నుంచి సితారకు రావడం జరిగిపోయాయి. 'స్వాతి ముత్యం' అనే క్లాసిక్ టైటిల్‌ని ఈ చిత్రానికి పెట్టే సాహసం ఎందుకు చేశారని చాలా మంది అడుగుతున్నారు. సాహసం అని కాదండి. నిర్మాత రాధాకృష్ణ (చినబాబు)కి స్టోరీ చెప్పకముందు వేరే టైటిల్ అనుకున్నాం. ఆయన మొత్తం కథ విన్నాక.. ఇందులో ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయని ఆయన ఈ టైటిల్‌ని సజెస్ట్ చేశారు. ఇందులో విలన్ అంటూ ఎవరూ ఉండరు. ఒక టౌన్లో కొన్ని ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ మధ్య జరిగే కథ ఇది. అందుకే ఆయన సలహాతో ఈ టైటిల్ పెట్టాం. వర్ష బొల్లమ్మ అద్భుతంగా నటించింది. సినిమా ఫస్ట్ కాపీ చూశాను. చాలా బాగా వచ్చింది. చిరంజీవి 'గాడ్ ఫాదర్', నాగార్జున 'ది ఘోస్ట్' వంటి పెద్ద సినిమాలతో పాటు మా సినిమా విడుదల కావడం కొంచెం భయంగా ఉన్నా సంతోషంగా ఉంది' అని లక్ష్మణ్ కె.కృష్ణ చెప్పారు.