Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శివకార్తికేయన్ కథానాయకుడిగా, అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న చిత్రం 'ప్రిన్స్'. శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఇండియాలోని పాండిచ్చేరి, లండన్ నేపథ్యంలో రూపొందుతోంది.
ఈ చిత్ర మ్యూజికల్ ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ 'బింబిలిక్కి పిలాపి' చార్ట్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ చిత్రం నుండి 'జెస్సికా' లిరికల్ వీడియోని విడుదల చేశారు.
ఎస్.ఎస్.తమన్ ఈ పాటని తనదైన స్టయిలీష్ బీట్‌లో డ్యాన్స్ నెంబర్‌గా కంపోజ్ చేశారు. తమన్ ఈ పాటని స్వయంగా పాడటంతో పాటు లిరికల్ వీడియోలో ఆయన కనిపించడం మరో విశేషం. తమన్ వాయిస్‌లో ఈ పాట ఇన్స్టంట్ అడిక్షన్‌గా అలరిస్తోంది.
శివకార్తికేయన్ ఈ పాటకు చేసిన డ్యాన్స్ మూమెంట్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. శివకార్తికేయన్, మారియా కెమిస్ట్రీ మెస్మరైజ్ చేసింది. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. ఈ పాట 'ప్రిన్స్' ఆల్బమ్‌లో మరో చార్ట్ బస్టర్‌గా నిలిచిందని చిత్ర బృందం తెలిపింది.
నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. అరుణ్ విశ్వ సహ నిర్మాత.
శివకార్తికేయన్, మరియా ర్యాబోషప్క, సత్యరాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: అనుదీప్ కె.వి, సంగీతం: ఎస్.ఎస్.తమన్, నిర్మాతలు: సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సమర్పణ: సోనాలి నారంగ్, సంగీతం: తమన్, డీవోపీ: మనోజ్ పరమహంస,
ఎడిటర్: ప్రవీణ్ కెఎల్, ఆర్ట్ : నారాయణ రెడ్డి.