Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రంజిత్ కోడిప్యాక సమర్పణలో చేబ్యం కిరణ్ శర్మ సహకారంతో రూపొందుతున్న చిత్రం 'ఇన్ సెక్యూర్'.
అదిరే అభి (అభినవ కృష్ణ), ఆమీక్షా పవార్, ప్రగ్యా నాయన్, సోనాక్షి వర్మ హీరో, హీరోయిన్లుగా సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్‌ని పూర్తి చేసుకుని, సెన్సార్ కార్యక్రమాల్లో ఉంది.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత మాట్లాడుతూ, 'తప్పు చేసి డబ్బు, హౌదాను అడ్డుపెట్టుకుని చట్టం నుండి ఎలాగైనా తప్పించుకోవచ్చు అనే చెడు ఆలోచనను దూరం చేసే ప్రయత్నగా ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ చిత్రంలో కీలక పోలీస్ పాత్రలో 'సీతారామం' ఫేమ్ మధు నంబియర్ అద్భుతంగా నటించారు. ప్రొడ్యూసర్ రాజేష్ నాయుడు మరో కీలక పాత్రని పోషించారు. ఈ చిత్రంలో అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలూ పుష్కలంగా ఉన్నాయి. నాయకానాయికలు అదిరే అభి, ఆమీక్షా పవార్, ప్రగ్యా నాయన్, సోనాక్షి వర్మల పాత్రలు చాలా భిన్నంగా ఉంటాయి. అందరికీ బాగా కనెక్ట్ అయ్యే పాత్రల్లో వీళ్ళందరూ ఎంతో చక్కగా నటించారు. కంటెంట్ పరంగా, సంగీతపరంగా, సినిమాటోగ్రఫీ పరంగా, నటీనటుల నటన పరంగా.. ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా అందరి సహకారంతో అవుట్‌ఫుట్ అద్భుతంగా వచ్చింది. మా చిత్రానికి 'ఇన్ సెక్యూర్' అని టైటిల్ ఎందుకు పెట్టామనేది మాటల్లో కంటే వెండితెరపై చూస్తేనే బాగుంటుంది. టైటిల్ జస్టిఫికేషన్ చేసేలా సినిమా ఉంటుంది. ఈ నెలలో సెన్సార్ పూర్తి చేసి, వచ్చే నెల అక్టోబర్ మూడో వారంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మా బ్యానర్లో నాలుగో చిత్రమిది. గతంలో 'నందికొండవాగుల్లోన', 'మోని', 'స్టూవర్టుపురం' చిత్రాలు నిర్మించాం. మా గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఈ సినిమాతో మా బ్యానర్‌కి మరింత మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాం' అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం : నవనీత్ చారి , మాటలు : బస్వాగాని భాస్కర్, మాటలు : శిల్ప కసుకుర్తి , నిర్మాత, దర్శకత్వం : సత్యనారాయణ ఏకారి.