Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనిత, ప్రఖ్యాంత్ సమర్పణలో ఎస్ఎమ్ఆర్ ఐకాన్ ఫిల్మ్స్, ప్రణ్వీ పిక్చర్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న చిత్రం 'లాట్స్ ఆఫ్ లవ్'.
డా. విశ్వానంద్ పటార్, ఆద్య, నిహాంత్, దివ్య, రాజేష్, భావన హీరో,హీరోయిన్లుగా డా. విశ్వానంద్ పటార్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఈనెల 30న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా శనివారం ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీరంగం సతీష్, ప్రత్తిపాటి శ్రీనివాసరావు, ఎస్ఎమ్ఆర్ ఐకాన్ ఫిల్మ్స్ అధినేత సోమేశ్వర్ రాజుతో పాటు చిత్రయూనిట్ మొత్తం పాల్గొంది. ఈ కార్యక్రమంలో ఎస్ఎమ్ఆర్ ఐకాన్ ఫిల్మ్స్ అధినేత సోమేశ్వర్ రాజు మాట్లాడుతూ, 'నేను, విశ్వానంద్ మంచి స్నేహితులం. ఈ సినిమా కథ నచ్చి, నేను కూడా భాగస్వామి అయ్యాను. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ నెల 30న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇందులో మంచి కంటెంట్ ఉంది. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను' అని అన్నారు. 'టైటిల్‌కు తగ్గట్టుగా ఇందులో చాలా ప్రేమ ఉంది. అది అందరికీ నచ్చుతుంది. ఆడిషన్స్‌కు చాలా మంది వచ్చినా.. నేను చేసిన పాత్రకు నేనే కరెక్ట్ అని భావించి ఈ ఆఫర్ ఇచ్చిన విశ్వగారికి ధన్యవాదాలు. నాతో పాటు నటించిన నటీనటులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను' అని హీరో రాజేష్ చెప్పారు.
దర్శక, నిర్మాత డా. విశ్వానంద్ పటార్ మాట్లాడుతూ, 'సినిమాని పూర్తి చేయడం అంత ఈజీ కాదు. కిరణ్, సతీష్ లేకపోతే ఇంత దాకా వచ్చేది కాదు. ఇందులో 5 స్టోరీస్ ఉంటాయి. కోవిడ్ టైంలో చిత్రీకరణ చాలా కష్టమైంది. కానీ, వెనక్కి తగ్గకుండా సినిమాని పూర్తి చేశాం. లేడీస్‌కు ఈ సినిమా పక్కాగా నచ్చి తీరుతుంది. పిల్లలతో కలిసి చూసే సినిమా ఇది. సాంగ్స్ బాగా ఎంజారు చేస్తారు. టికెట్స్ రేట్స్ కూడా తగ్గిస్తున్నాం. నాకు ఈ సినిమా నిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం' అని తెలిపారు.