Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాగార్జున
అక్కినేని నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో రూపొందిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ది ఘోస్ట్'. సోనాల్ చౌహాన్ కథానాయిక.
నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్‌తో కలిసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో కర్నూలులోని ఎస్టీబిసి గ్రౌండ్లో ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. భారీ సంఖ్యలో అక్కినేని అభిమానులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, '33 ఏళ్ల కిందట అక్టోబరు 5న 'శివ' అనే ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అప్పుడు చైన్ పట్టుకుని వచ్చాను. అదే అక్టోబరు 5న కత్తి పట్టుకుని వస్తున్నాను. ది ఘోస్ట్ కూడా ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్. విజయదశమి అందరికీ విజయాన్నిస్తుందని అంటారు. ఈ పండగ మాకు కూడా విజయాన్నిస్తుందని నమ్ముతున్నా. మీ అందరికీ నచ్చి, మెచ్చుతారని అనుకుంటున్నాను.'ది ఘోస్ట్' తీసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారుకి యాక్షన్, డ్రామా అంటే ఇష్టం. ఆ రెండింటినీ కలిపి ఈ సినిమా తీశారు. 'శివ' సమయంలో సౌండ్స్ గురించి మాట్లాడారు. ఇందులో ఎఫెక్ట్స్, మ్యూజిక్ నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. నేను చాలా సినిమాల్లో గన్స్ వాడాను. ఈ ఏడాది ఆరంభంలో నాగచైతన్యతో కలిసి 'బంగార్రాజు'తో ప్రేక్షకుల ముందుకొచ్చా. అది థియేటర్లలో ఎంతగానో ఆదరణ పొందింది. ఓటీటీ, టెలివిజన్లలో రికార్డులు సృష్టించింది. దానికి వచ్చిన టీఆర్పీ ఈ ఏడాది ఏ సినిమాకీ రాలేదు. త్వరలో అఖిల్‌తో కలిసి నటిస్తున్నా. నన్ను ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటారో 'ది ఘోస్ట్'లో అలాగే కనిపిస్తా. నేను యాక్షన్ సినిమా చేసి చాలా రోజులైంది. నాకెంతో ఆప్తులైన చిరంజీవి సినిమా కూడా విజయదశమికి విడుదలవుతోంది. ఈ రెండు సినిమాలకి విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు.
'నాగార్జునని డైరెక్ట్ చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. అందరీ అంచనాల్ని అందుకునేలా 'ది ఘోస్ట్' ఉంటుంది. నాగార్జునని ఎలా చూసి పెరిగానో అలాంటి ఇంటెన్స్ లుక్స్‌తో ఆయన్ని తెరపై చూపించాను. చిత్రబృందం చక్కటి సహకారం అందించింది. నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ గొప్ప సపోర్ట్ అందించారు. డీవోపీ ముకేష్ , ఎడిటర్ ధర్మేధ్ర, సివి రావు, మోహన్, భరత్, సౌరభ్, మార్క్ కె.రాబిన్ మిగతా టీం అందరికీ థ్యాంక్స్. ఈ చిత్రాన్ని చూసి ఎంజారు చేస్తారని కోరుకుంటున్నాను' అని దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెలిపారు.
గత నాలుగైదు నెలలుగా ఎప్పుడు కలిసినా 'ది ఘోస్ట్' సినిమా గురించే నాన్న మాట్లాడారు. ఒక సినిమా గురించి ఇలాంటి ఎగ్జైట్మెంట్ నాన్నలో చూసి చాలా రోజులైంది. నాన్నని స్టైలిష్, యాక్షన్ సినిమాలో చూడటానికి నేను ఇష్టపడతాను. అలాంటి సినిమానే తీశారు ప్రవీణ్ సత్తారు.
- నాగ చైతన్య
నాన్నని ఎలా చూడాలనుకుంటున్నానో అలానే చూస్తున్నా. నాన్నని ఇంటెన్స్ ఫైర్‌తో చూపించిన దర్శకుడు ప్రవీణ్‌కి థ్యాంక్స్.
- అఖిల్