Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాధా మమతా ప్రెజెంట్స్, ఎస్.కె. ఆర్ట్స్ బ్యానర్స్ పై 'దుర్మార్గుడు' ఫేమ్ విజరు కృష్ణ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'గణా'. సుకన్య, తేజు హీరోయిన్స్‌గా నటించారు. సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'విజరు కృష్ణ కృషితో, పట్టుదలతో, దీక్షతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆయన హీరోగా నటిస్తూ కథ, స్క్రీన్ ప్లే, ప్లస్ డైరెక్షన్ కూడా చేశారు. ఆయనే ప్రొడ్యూసర్ కూడా. అన్నీ ఆయనే చేస్తూ సినిమా తీయడమంటే మామూలు విషయం కాదు. దీనికి ఎంతో సహకారం ఉండాలి. ఆదిత్యా శేషారెడ్డి, ఫారిన్ నుండి ఎమ్.యు.ఎస్ రెడ్డి, కాకినాడ కార్పొరేటర్ బాల ప్రసాద్, కర్రి బుచ్చిరెడ్డి ఇలా అందరూ కలిసి ఒక మంచి సినిమా తీయాలనే తపనతో మన ముందుకొచ్చారు. నా చేతుల మీదుగా ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
'మాకు ఎస్వీ కృష్ణారెడ్డి ఆదర్శం. మా మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినందుకు ఆయనకి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. నేను గతంలో 'దుర్మార్గుడు', 'గోవిందా భజ గోవింద' సినిమాల్లో ప్రధాన పాత్రలు చేశాను. 'పాగల్' వంటి పలు చిత్రాల్లో విలన్‌గా కూడా చేశాను. హీరోగా ఇది నా మూడో సినిమా. నేను తొలిసారి ఈ చిత్రానికి డైరెక్ట్ చేశాను. సినిమాని నా సొంత బ్యానర్ ఎస్.కె.ఆర్ట్స్‌లో నిర్మించాను. ఈ సినిమా నిర్మాణంలో సహాయం చేసిన వారందరికీ ధన్యవాదాలు. ప్రేక్షకులను అలరించే పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ ఇది' అని చెప్పారు.
నాగ మహేష్, ప్రభు, ఛత్రపతి ఫేమ్ జగదీష్, దత్తు విలన్లుగా నటించగా, సీనియర్ నటుడు హేమ సుందర్, జబర్దస్త్ అప్పారావు, దొరబాబు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఎడిటర్ : నందమూరి హరి-ఎన్టీఆర్, డీఓపి : సన్ని. సంగీతం : చిన్ని కృష్ణ, స్టంట్స్: శివరాజ్ మాస్టర్, లైన్ ప్రొడ్యూసర్స్ : బాల ప్రసాద్, ఎమ్.యు.ఎస్.రెడ్డి, కర్రి బుచ్చిరెడ్డి.