Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆనంద్, మురళీ కృష్ణంరాజు, శృతిశెట్టి, మెహబూబ్ షేక్ (ఎమ్.ఎస్), రాకేష్ మాస్టర్ ముఖ్య తారాగణంగా పృథ్వి పేరిచర్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'స్కై'. వేలర్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్‌పై నాగిరెడ్డి గుంటక, మురళీ కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రం ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది.
'ఒక వ్యక్తి అన్నీ కోల్పోయి ఒంటరిగా బతకాల్సి వస్తే?, ఏళ్ల తరబడి అనుభవిస్తున్న బాధ, ఆనందంతో తన ఒంటరితనాన్ని జయించాడా, లేదా? లేక ఏకాకి జీవితమే కదా అని రోజు గడవడం కోసం పక్కవాడ్ని మోసం చేస్తూ బతికేస్తున్నాడా?, అసలు ఒంటరితనం మనిషికి ఏం నేర్పుతుంది?, మనిషిని ఎలా మలుస్తుంది? అనేది 'స్కై' చిత్ర కథాంశం, రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ, సురేష్ ఆర్స్ ఎడిటింగ్ ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్స్' అని దర్శకుడు పృథ్వి పేరిచర్ల తెలిపారు.
'చివరి షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలతోపాటు, ప్యాచ్ వర్క్ కూడా పూర్తి చేయనున్నాం. తెలుగువారంతా గర్వపడే చిత్రమిది' అని నిర్మాతలు నాగిరెడ్డి గుంటక, మురళీ కృష్ణంరాజు చెప్పారు.