Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీకర్, అపూర్వ జంటగా హరికృష్ణ జినుకల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'హౌస్ హజ్బెండ్'. శ్రీకరణ్ ప్రొడక్షన్స్, లయన్ టీమ్ క్రెడిట్స్ బేనర్స్ పై రూపొందుతున్న ఈ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమం మంగళవారం ఫిలించాంబర్‌లో ఘనంగాఆ జరిగింది. టియఫ్‌సిసి చైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్, నిర్మాత రామ సత్యనారాయణ, లయన్ సాయి వెంకట్, వైయస్ఆర్టిపీ రాష్ట్ర కార్యదర్శి మల్లిఖార్జున్, సమైక్య ఆంధ్ర సమితి జాతీయ అధ్యక్షుడు గొంటి కుమార్ చౌదరి, నటి కరాటే కళ్యాణి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రొడక్షన్ హౌస్ తరపున నుంచి ఐఏయస్ స్టడీ కోసం ఒక విద్యార్థినికి చెక్ అందజేశారు.
ఈ సందర్భంగా హీరో శ్రీకర్ మాట్లాడుతూ, 'ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. ఒక హౌస్ హజ్బెండ్ కావాలి అనుకున్న అమ్మాయికి ఎలాంటి సిట్చ్యువేషన్స్ ఎదురయ్యాయి అనేదే సినిమా. దర్శకుడు ఎంతో డెడికేషన్‌తో సినిమా చేశారు. ఒక షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేశాం' అని తెలిపారు. 'ఇది నా తొలి చిత్రం. స్టోరి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇందులో నేను సాప్ట్వేర్ ఉద్యోగినిగా నటించాను' అని హీరోయిన్ అపూర్వ రారు అన్నారు. దర్శక, నిర్మాత హరికృష్ణ మాట్లాడుతూ,'ఇది సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. కరోనా టైమ్‌లో కర్ణాటకలోని ఫారెస్ట్ ఏరియాలో ఒక షెడ్యూల్ చేశాం. అక్కడి పబ్లిక్ , పోలీస్ డిపార్ట్ మెంట్ వారు ఎంతో సపోర్ట్ చేయడంతో అనుకున్న విధంగా షెడ్యూల్ పూర్తి చేయగలిగాం' అని చెప్పారు.